MLC Kavitha: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

MLC Kavitha: అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా అంటూ కవిత ఫైర్‌

Shekhar G
Published on: 23 Jan 2024 8:47 AM IST
MLC Kavitha Counter To Minister Ponnam Prabhakar Through X
X

MLC Kavitha: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ 

MLC Kavitha: మంత్రి పొన్నం ప్రభాకర్‌కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని ట్విట్టర్ వేదికగా కవిత ప్రశ్నించారు.

విగ్రహం ఏర్పాటు చేయమని.. భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వకుండా...స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ట్వట్టర్‌లో కవిత ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించామని.

ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామని ట్విట్టర్‌లో కవిత రాసుకొచ్చారు. భవిష్యత్తులో రాజకీయాల కోసం, సoకుచిత మనస్తత్వంతో, ఈ మహాకార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నా.. అంటూ కవిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అందుకే ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని.. భారత జాగృతి తరుపునే కాకుండా యావత్‌ తెలంగాణ ప్రజల తరుపున మరోసారి కోరుతున్నా. అంటూ ట్విట్టర్‌లో వెల్లడించారు.


Shekhar G

Shekhar G

Next Story