MLC Kavitha: నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kavitha: హైదరాబాద్‌లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితను కలిసిన నిఖత్ జరీన్, ఇషాసింగ్‌

Jyothi
Published on: 29 Dec 2022 1:39 PM IST
MLC Kavitha Congratulates Nikhat Zareen And Isha Singh
X

MLC Kavitha: నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kavitha: జాతీయస్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఇషాసింగ్‌‌లకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితను నిఖత్ జరీన్, ఇషాసింగ్‌‌ కలిశారు. జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారామె... జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన క్రీడాకారిణి ఇషాసింగ్‌‌కు కవిత అభినందనలు తెలిపారు. వీరిద్దరి విజయం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.



Jyothi

Jyothi

Next Story