MLC Kavitha: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా.. వెంటపడి ఓడిస్తా
MLC Kavitha: ఇంకోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతాం
MLC Kavitha: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా.. వెంటపడి ఓడిస్తా
MLC Kavitha: ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ మాటలు హేయంగా ఉన్నాయని.. తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నారని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నకవిత.. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. రాజకీయాల్లో ఉంటే నీతి, నిజాయితీ, ఇంగిత జ్ఞానం ఉండాలి. కుక్కు కాటుకు చెప్పుదెబ్బ తప్పదు. అరవింద్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడి సమయం వృథా చేసినందుకు మీడియాకు క్షమాపణలు చెబుతున్నాను. నేను మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరతానని అన్నానా?. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తాను. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది నువ్వు అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
Next Story




