MLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి

MLC Kavitha: రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామాల్లోకి వచ్చిన నాయకుల్ని ఎందుకొచ్చారో నిలదీయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Arun Chilukuri
Published on: 21 May 2022 5:00 PM IST
MLC Kavitha Comments On Congress Leaders
X

MLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి

MLC Kavitha: రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామాల్లోకి వచ్చిన నాయకుల్ని ఎందుకొచ్చారో నిలదీయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్ని చూపించాలని సూచించారు. లోక్‌సభలో రాహుల్ గాంధీని తెలంగాణ గురించి ప్రశ్నించి రావాల్సిన నిధుల విడుదలకు కృషిచేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసోళ్లు గ్రామాలకు వస్తే ప్రకృతివనాలు, డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు చూపించాలన్నారు. కోరుట్లలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి బీజేపీని ఎందుకు విమర్శించరని కవిత ప్రశ్నించారు. పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై ఎందుకు విమర్శించరని, ఇరు పార్టీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందేమోనని సందేహం వ్యక్తంచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story