MLC Kavitha: మొక్కజొన్న కంకులు అమ్మే మహిళతో సరదాగా ముచ్చటించిన కవిత

MLC Kavitha: రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కొన్న కవిత

Jyothi
Published on: 10 July 2023 6:20 PM IST
MLC Kavitha Bought The Corn Cobs At The Roadside
X

MLC Kavitha: మొక్కజొన్న కంకులు అమ్మే మహిళతో సరదాగా ముచ్చటించిన కవిత

MLC Kavitha: నిత్యం అభివృద్ధి కార్యక్రమాల్లో, ప్రజా క్షేత్రంలో బీజీ బిజీగా ఉండే ఎమ్మెల్సీ కవిత.. మొక్కజొన్న కంకులు అమ్మే మహిళతో కలిసి కాసేపు సరదాగా మాట్లాడారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత.. తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారు వద్ద కాసేపు ఆగారు. రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళ దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. అంతేకాదు.. మొక్క జొన్న కంకులు అమ్మే కొమురమ్మతో కవిత మాట కలిపారు.

సీఎం కేసీఆర్‌ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. నాటి పాలనకు కేసీఆర్ సార్ పాలనకు ఉన్న తేడాను కొమురమ్మ వివరించింది. తనకే కాదు ఇంటింటికి పింఛన్, పలు సంక్షేమ పథకాలు కేసీఆర్ సార్‌ మంచిగిస్తుండని కొమురమ్మ సంబురంగా చెప్పింది. స్వయంగా సీఎం కేసీఆర్ కూతురే తన వద్ద మొక్కజొన్న కంకి కొనుగోలు చేయడంతో పాటు మాట కలపడంతో కొమురమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు ఎమ్మెల్సీ కవితను చూసిన స్థానిక వాహనదారులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ తమ అభిమానాన్ని చాటుకోగా.. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ఎమ్మెల్సీ కవిత.

Jyothi

Jyothi

Next Story