MLC Kavitha: ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: రెండోసారి ఈడీ విచారణకు హాజరైన కవిత

Jyothi
Published on: 20 March 2023 10:59 AM IST
MLC Kavitha Attended the ED investigation
X

MLC Kavitha: ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆమె వెంట భర్తతో పాటు.. ఇతర బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఉన్నారు. ఈడీ ఆఫీస్ గేటు దగ్గరే ఇతర నేతలు అందర్నీ నిలిపివేశారు. కవిత మాత్రమే ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ ఇప్పటికే కవిత... సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే మార్చి 16వ తేదీన విచారణకు హాజరుకాలేదు. ఇవాళ మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ ఆదేశంతోనే కవిత విచారణకు హాజరయ్యారు. ఈడీ ఆఫీసులోకి వెళుతున్న సమయంలో.. పిడికిలి బిగించి అభిమానులకు అభివాదం చేశారు. ఆఫీసులోకి వెళుతున్న సమయంలో భర్త వెన్నంటే ఉండి.. భుజం తట్టి ధైర్యం చెప్పి పంపించారు.

Jyothi

Jyothi

Next Story