MLC Kavitha: మోకాళ్ల యాత్ర చేస్త‌రో.. మోక‌రిల్లుతారో.. పసుపు బోర్డు తేవాల్సిందే..

MLC Kavitha: పసుపు బోర్డుపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ను ఎమ్మెల్సీ కవిత నిలదీశారు.

Arun Chilukuri
Updated on: 4 May 2022 7:45 PM IST
MLC Kavitha Attacks MP Arvind on Turmeric Board Vow
X

MLC Kavitha: మోకాళ్ల యాత్ర చేస్త‌రో.. మోక‌రిల్లుతారో.. పసుపు బోర్డు తేవాల్సిందే..

MLC Kavitha: పసుపు బోర్డుపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ను ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. అబద్ధపు హామీలతో అర్వింద్ ఎంపీగా గెలిచారని ఆమె మండిపడ్డారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ఇప్పిస్తామన్నారు ఏమైందని కవిత సూటిగా ప్రశ్నించారు. ఎన్ని రోజులు ఇలా ప్రజలకు అబద్ధాలు చెప్తారంటూ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల రాబడి రెట్టింపు చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మూడేళ్లుగా హామీలు నెరవేరుస్తారని చూస్తున్నాం, ఇక విడిచిపెట్టేది లేదని కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో మోకాళ్లపై యాత్రే చేస్తారో మీ నాయకుల కాళ్ల మీద మోకరిల్లుతారో పసుపు బోర్డుతోనే రావాలని ఆమె డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story