MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: కోర్టు ఆదేశించినా తీహార్ జైలు అధికారులు పట్టించుకోవడం లేదు

Shashank Gullapelli
Published on: 29 March 2024 8:04 AM IST
MLC Kavitha Approached The Court In The Delhi Liquor Case
X

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించింది. కోర్టు వెసులుబాట్లు ఇవ్వాలని ఆదేశించినప్పటికి తీహార్‌ జైలు అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అనారోగ్య సమస్యలు ఉండటంతో తన విజ్ఞప్తి కారణంగా కోర్టు కొన్ని వెసులుబాట్లు కల్పించిందన్నారు. జైలు అధికారుల తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. తనకు వెసులుబాట్లు కల్పించేలా తీహార్ జైలు సూపరింటిండెంట్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం..ఈనెల 30న విచారణ జరుపుతామని తెలిపింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story