సీఎం కేసీఆర్ చ‌రిత్ర సృష్టించారు: ఎమ్మెల్సీ క‌విత

MLC Kalvakuntla Kavitha: తెలంగాణలో మెగా జాబ్ మేళా చరిత్రలో నిలిచిపోతుందని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Arun Chilukuri
Published on: 9 March 2022 3:32 PM IST
MLC Kalvakuntla Kavitha Praises CM KCR Over Job Notifications
X

సీఎం కేసీఆర్ చ‌రిత్ర సృష్టించారు: ఎమ్మెల్సీ క‌విత

MLC Kalvakuntla Kavitha: తెలంగాణలో మెగా జాబ్ మేళా చరిత్రలో నిలిచిపోతుందని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై కవిత స్పందించారు. 80,039 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేస‌న్లు నేటి నుంచే వెలువ‌డుతాయ‌ని సీఎం కేసీఆర్ శాస‌న‌స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించి చ‌రిత్ర సృష్టించార‌ని క‌విత ప్ర‌శంసించారు.

నిరుద్యోగుల్లో ఆశలను కేసీఆర్ సజీవంచేశారని అభిప్రాయం వ్యక్తంచేశారు. నిరుద్యోగుల కుటుంబాల్లో కేసీఆర్ సంతోషం నింపారని పేర్కొన్నారు. 80,039 ఉద్యోగ నియామ‌కాల్లో స్థానికుల‌కు 95 శాతం ఉద్యోగాలు దక్కేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని తెలిపారు. మ‌రో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story