Kadiyam Srihari: బీజేపీ వాళ్లు గాడ్సే వారసులు.. మేమే నిజమైన అంబేద్కర్ వారసులం

MLC Kadiyam Srihari Slams BJP Leaders
x

Kadiyam Srihari: బీజేపీ వాళ్లు గాడ్సే వారసులు.. మేమే నిజమైన అంబేద్కర్ వారసులం

Highlights

Kadiyam Srihari: బీజేపీ నేతలు గాడ్సే వారసులని సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కడియం శ్రీహరి.

Kadiyam Srihari: బీజేపీ నేతలు గాడ్సే వారసులని సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కడియం శ్రీహరి. మేమే నిజమైన అంబేద్కర్ వారసులమని బీజేపీ నేతలు కాదన్నారు. దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకునే కొత్త రాజ్యాంగం రచించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే కేసీఆర్‌ అన్నారని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కొత్త రాజ్యాంగం కావాలని సీఎం సూచన చేశారని శ్రీహరి పేర్కొన్నారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు. అనవసరంగా నోరు పారేసుకుంటే బీజేపీ నేతలను తెలంగాణ ప్రజలు తరిమికొడతారని కడియం శ్రీహరి జోస్యం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories