Telangana: ఓటమి భయంతోనే కేసీఆర్ నీతిమాలిన రాజకీయాలు: ఎంపీ కోమటిరెడ్డి

MLC Elections: అధికార టీఆర్ఎస్ ఓట్ల కొనుగోళ్లకు తెరలేపిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపణలు చేశారు.

Venkata Chari
Published on: 13 March 2021 7:48 PM IST
MLC Elections: MP Komati Reddy Fires On CM KCR
X

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

MLC Elections: అధికార టీఆర్ఎస్ ఓట్ల కొనుగోళ్లకు తెరలేపిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారని ఎంపీ ఆరోపించారు.

వైరా ఎమ్మెల్యే ఓట్లు కొనుగోలు చేయాలన్నారని ఆరోపించిన ఎంపీ.. వైరా ఎమ్మెల్యేపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బులు పంచుతుండగా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Venkata Chari

Venkata Chari

Next Story