Election Code: విజయగర్జన సభకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డొచ్చే ఛాన్స్

Election Code: కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా ఈ నెల 29న వరంగల్‌ విజయ గర్జన

Sandeep Eggoju
Published on: 9 Nov 2021 5:44 PM IST
MLC Election Code Break to Vijaya Garjana Sabha in Warangal District
X
వరంగల్ విజయగర్జన సభకు ఎన్నికల కోడ్ అడ్డొచ్చె ఛాన్స్ (ఫైల్ ఇమేజ్)

Election Code: వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించాలని భావించిన విజయగర్జన సభ మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయి. కేసీఆర్ దీక్షా దివస్ సందర్బంగా ఈ నెల 29న వరంగల్‌ విజయ గర్జన నిర్వహించేందుకు టీఆర్ఎస్‌ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 లక్షల మందిని తరలించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ నాయకులు సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. కానీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 16న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. 23న నామినేషన్లను కూడా స్వీకరించనున్నారు. ఈ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వరంగల్‌ విజయ గర్జన మరోసారి వాయిదా పడవచ్చని టీఆర్‌ఎస్‌ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే నవంబర్‌ 15న జరగాల్సిన సభను ఈ నెల 29కి వాయిదా వేశారు. కానీ ఈసారి 29న సభ నిర్వహణకు సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story