Gongidi Sunitha: కాంగ్రెస్ పై సంచలన వాఖ్యాలు చేసిన ఎమ్మెల్యే సునీత

* కాంగ్రెస్‌లోనే ఉన్నామని, పార్టీ మారలేదని మీడియా ముందుకొచ్చిన కౌన్సిలర్లు.. ఆసక్తికరంగా మారిన ఆలేరు రాజకీయాలు

R Tripura Malini
Updated on: 27 Nov 2022 7:58 AM IST
mla sunitha made sensational comments on Congress
X

కాంగ్రెస్ పై సంచలన వాఖ్యాలు చేసిన ఎమ్మెల్యే సునీత

Congress: ఆలేరు నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులతీరు చర్చనీయాంశమైంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు , ఎమ్మెల్యే గొంగిడి సునీతను సంప్రతించారు. దీంతో ఎమ్మెల్యే సునీత దంపతులు ఆ నలుగు కౌన్సిలర్లను పురపాలక మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర‌్భంగా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి స్వాగతించారు. దీంతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాళీ అయిందని ఎమ్మెల్యే గొంగిడి సునీత మ‌ధ్యాహ్నం ప్రకటించారు.

సాయంత్రానికి సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీనుంచి టీఆర్ఎస్‌లో చేరిపోయారనుకున్న కౌన్సిలర్లు స్పందించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని మీడియా ముందుకొచ్చారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి బీర్ల ఐలయ్యతోనే ఉంటామని కాంగ్రెస్ కైన్సిలర్లు ప్రకటించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ప్రజాసమస్యలను పరిష్కరించి, అభివృద్ధిపనులు చేపట్టాలని ఎమ్మెల్యే గొంగిడి సునీతకు విన్నవించేందుకు వెళ్తే మంత్రి కేటీఆర్‌ వద్దకు తీసుకెళ్లి టీఆర్ఎస్ కండువా కప్పారని కాంగ్రెస్ కౌన్సిలర్లు బిట్టు హరీశ్, ముక్కెర్ల మల్లేశ్ యాదవ్‌ తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story