Sridhar Babu: కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్లే మంథనిలో వరద పోటెత్తింది

Sridhar Babu: సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్‌తోనే పొలాలు నీట మునిగాయి

Rama Rao
Updated on: 25 July 2022 7:15 PM IST
MLA Sridhar Babu Demands to Announce a Special Package for Manthani
X

Sridhar Babu: కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్లే మంథనిలో వరద పోటెత్తింది

Sridhar Babu: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్లే మంథని నియోజకవర్గంలోని పంటపొలాలన్నీ నీటిలో మునిగిపోయాయని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆరోపించారు. గ్రామాల్లోకి వరదనీరు పోటెత్తి భారీ నష్టం జరిగినా ప్రభుత్వం ఇప్పటివరకు నష్టపరిహారం ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతి బ్యారేజీ పంప్‌హౌస్‌ను పరిశీలించేందుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని శ్రీధర్ బాబు అన్నారు.

ప్రభుత్వం వెంటనే మంథనికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక మేటలు వేసిన పంట పొలాలకు లక్ష రూపాయలు పంట నష్టపోయిన రైతులకు 25వేలు, ఇల్లు ధ్వంసమైన వారికి డబుల్ బెడ్‌ రూం ఇళ్లను కట్టించాలని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story