కోతిని చంపి చెట్టుకు ఉరేసిన దుండగులు.. చలించిపోయిన ఎమ్మెల్యే..

Shankar Naik: గుర్తు తెలియని వ్యక్తులు వానరాన్ని ఉరి వేసి చెట్టుకు వేలాడదీసిన ఘటనను చూసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ చలించిపోయారు.

Arun Chilukuri
Updated on: 2 Oct 2021 8:15 PM IST
MLA Shankar Naik Makes Monkey Funeral
X

కోతిని చంపి చెట్టుకు ఉరేసిన దుండగులు.. చలించిపోయిన ఎమ్మెల్యే..

Shankar Naik: గుర్తు తెలియని వ్యక్తులు వానరాన్ని ఉరి వేసి చెట్టుకు వేలాడదీసిన ఘటనను చూసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ చలించిపోయారు. వెంటనే వాహనం దిగి వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ నెల్లికుదురు మండల కేంద్రంలో బతకమ్మ చీరలను పంపిణీ చేసి వరంగల్‌కు వెళ్తుండగా కాచికల్లు శివారులో మృతి చెందిన వానరం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే వాహనాన్ని ఆపి, వానర మృతదేహాన్ని కిందికి దింపి, జేసీబీతో గుంతను తీయించి దాన్ని ఖననం చేయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story