President Polls: కన్ఫ్యూజన్‌లో ఎన్డీయే అభ్యర్థికి ఓటేసిన ఎమ్మెల్యే సీతక్క..

MLA Seethakka Votes NDA Candidate in Presidential Election
x

President Polls: కన్ఫ్యూజన్‌లో ఎన్డీయే అభ్యర్థికి ఓటేసిన ఎమ్మెల్యే సీతక్క..

Highlights

MLA Seethakka: రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు.

MLA Seethakka: రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన బ్యాలెట్‌పేపర్‌పై ఎన్డీఏ అభ్యర్థికి టిక్‌ చేశారు. అయితే ఓటు వేసేటప్పడు తాను కన్‌ఫ్యూజ్ అయ్యానన్నారు. మళ్లీ ఓటేసేందుకు అనుమతి ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే సీతక్క. మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని కోరడంతో.. నిబంధనల ప్రకారం అవకాశం ఇవ్వలేమన్నారు అధికారులు. బ్యాలెట్‌ పేపర్‌ను డ్రాప్‌ బాక్స్‌లో వేయకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. అధికారుల తుది నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తున్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories