ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎమ్మెల్యే సీతక్క పర్యటన

MLA Seethakka: కరకట్ట రివిటింగ్ పనులు చేయాలని డిమాండ్

Rama Rao
Updated on: 15 July 2022 4:19 PM IST
MLA Seethakka Visited the Flood Affected Areas
X

ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎమ్మెల్యే సీతక్క పర్యటన

MLA Seethakka: ములుగు జిల్లా ఏటూరునాగారంలో గోదావరి వరద ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారి కష్టాలను విన్నారు. ఈ సందర్భంగా ఓడగూడం పద్మశాలి వాడ బాధితులకు దీర్ఘకాలిక పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కోడిపుంజులు అంగడి దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని వరద బాధితులకు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కరకట్టను రివిటింగ్ చేయాలని రెండు సంవత్సరాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కరకట్ట రివిటింగ్ పనులు చేయాలని నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.


Rama Rao

Rama Rao

Next Story