ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు హైకోర్టులో నిరాశ

X
Highlights
ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఓటుకు నోటు కేసు నుంచి.. సండ్ర వెంకట వీరయ్యను తొలగించేందుకు హైకోర్టు నిరాకరించింది.
Krishna9 Dec 2020 2:45 AM GMT
ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఓటుకు నోటు కేసు నుంచి.. సండ్ర వెంకట వీరయ్యను తొలగించేందుకు హైకోర్టు నిరాకరించింది. సండ్ర డిశ్చార్జ్ పటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. న్యాయస్థానంలో కేసు విచారణ కొనసాగింది. అయితే.. కేసుతో సంబంధం ఉన్న రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా కోర్టుకు హాజరు కాలేదు. ఈ నెల 15 కచ్చితంగా హాజరవ్వాలని నిందితులందరికీ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హాజరు మినహాయింపు కోసం పిటిషన్‌లను అనుమతించేది లేదని కోర్టు స్పష్టం చేసింది.
Web TitleMLA sandra venkata veeraiah disappointed in High Court in vote for note case
Next Story