Rega Kantha Rao: అంబేద్కర్ సాక్షిగా నన్ను అవమానించారు

Rega Kantha Rao: ఆదివాసీ బిడ్డనైన తనను అంబేద్కర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సాక్షిగా ప్రోటోకాల్ పాటించకుండా..

Arun Chilukuri
Published on: 29 Aug 2021 3:11 PM IST
MLA Rega Kantha Rao Fires on Officers Over Protocol Issue
X

Rega Kantha Rao: అంబేద్కర్ సాక్షిగా నన్ను అవమానించారు

Rega Kantha Rao: ఆదివాసీ బిడ్డనైన తనను అంబేద్కర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సాక్షిగా ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆరోపించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులతో పాటు అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని శనివారం రాత్రి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం స్టేజి మీదకు పిలువలేదని మంత్రి పువ్వాడ సమక్షంలోనే రేగా వాపోయారు. ఈ విషయమై స్టేజి మీద ఉన్న కలెక్టర్‌కు మౌఖికంగా కంప్లైట్ ఇస్తున్నాని, నేడు రిటర్న్ కంప్లైంట్ ఇస్తానని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story