మంత్రి సత్యవతి రాథోడ్‌పై ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ఫైర్‌..

Redya Naik: మంత్రి సత్యవతి రాథోడ్‌పై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్.

Arun Chilukuri
Updated on: 4 July 2022 4:53 PM IST
MLA Redya Naik Controversial Comments on Minister Satyavathi Rathod
X

మంత్రి సత్యవతి రాథోడ్‌పై ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ఫైర్‌

Redya Naik: మంత్రి సత్యవతి రాథోడ్‌పై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్. మరిపెడ మండల కేంద్రంలో వికలాంగులకు సైకిళ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే స్త్రీ, శిశు సంక్షేమానికి సంబంధించిన విషయాలేవీ తనకు తెలియడం లేదంటూ మండిపడ్డారు. ఇది అధికారుల తప్పిదమో లేక మంత్రి తప్పిదమో తెలియని పరిస్థితి నెలకొందని తీవ్ర విమర్శలు చేశారు.

గతంలో ఏ శాఖ నుంచి ఏ పథకం వచ్చినా స్థానిక ఎమ్మెల్యేను అడిగి అందించేవారని చెప్పారు. ప్రభుత్వ పథకాల గురించి చాలామంది లబ్ధిదారులు తమ దగ్గరకు వస్తుంటారని, అప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైనా పద్ధతి కాదని, కనీసం మీరు ఇచ్చే పథకాలైనా చెప్పుకోవాలి కదా..? అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story