మరోసారి మొరాయించిన రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. ప్రాణహాని ఉన్న..

MLA Raja: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించింది.

Arun Chilukuri
Updated on: 14 Nov 2022 4:09 PM IST
MLA Raja Singhs Bullet-Proof Vehicle Breaks Down in Hyderabad
X

మరోసారి మొరాయించిన రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. ప్రాణహాని ఉన్న..

MLA Raja: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించింది. వాహనం మార్చాలని ఇంటెలిజెన్స్ ఐజీకి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవ‌టం లేదన్నారు రాజాసింగ్. ప్రాణహాని ఉన్న తన పట్ల ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. 4 నెలల క్రితం రోడ్డు మధ్యలో ఆ వాహనం ఆగిపోతే ఇంటెలిజెన్స్‌ కార్యాలయానికి పంపించాను. మరమ్మతులు చేసి అదే వాహనాన్ని మళ్లీ ఇచ్చారు. 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ ఆగిపోయింది. గన్‌మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లాను. అఫ్జల్‌గంజ్‌ వద్ద మరోసారి ఆగిపోయింది. అప్పుడు సొంత వాహనం రప్పించుకుని వెళ్లాను అని రాజాసింగ్‌ అసహనం వ్యక్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story