logo
తెలంగాణ

MLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..

MLA Raja Singh Says he Will be Murdered
X

MLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు.. 

Highlights

MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మం కోసం మాట్లాడుతున్న తనను వందకు వంద శాతం చంపేస్తారని, ఈ విషయం తనకు కూడా తెలుసని హాట్ కామెంట్స్ చేశారు. ప్రతి గ్రామంలో హిందువులను టార్గెట్ చేస్తున్నారన్నారు. హిందువులపై వ్యతిరేకంగా హిందువులతోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారన్నారు. ధర్మం కోసం ఎదిరించి మాట్లాడితే గొంతులు, తలలు నరుకుతున్నారన్నారు. ధర్మం గురించి మాట్లాడే తనలాంటి వారు కొంతమంది ఉండొచ్చని, దీనిపై మాట్లాడుతున్నందుకు ఇవ్వాళ కాకపోతే రేపు తనపై బుల్లెట్లను ఉపయోగిస్తారని రాజాసింగ్ చెప్పారు. వందకు వంద శాతం తనను చంపేస్తారని, ఇది పక్కా అని, డేట్ కూడా రాసి పెట్టుకోండని చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.


Web TitleMLA Raja Singh Says he Will be Murdered
Next Story