Raghunandan Rao: మైనర్ బాలికను రేప్ చేస్తే పోలీసులు స్పందించరా?

Raghunandan Rao: టీఆర్ఎస్ పరిపాలన ప్రజాస్వామ్య బద్దంగా లేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు.

Arun Chilukuri
Published on: 10 Aug 2021 7:38 PM IST
MLA Raghunandan Rao slams Police
X

Raghunandan Rao: మైనర్ బాలికను రేప్ చేస్తే పోలీసులు స్పందించరా?

Raghunandan Rao: టీఆర్ఎస్ పరిపాలన ప్రజాస్వామ్య బద్దంగా లేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పోలీస్ తీరులపై అసహనం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూడటం బాధాకరమన్నారు రఘునందన్ రావు.

ఖమ్మంలో మైనర్ బాలికపై ప్రజాప్రతినిధి అత్యాచారం చస్తే పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం హేయమైన చర్య అన్నారు. ఇంద్రవెళ్లికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు పెట్టడం బాధకరమన్నారు. 2004 నుంచి 2014 వరకు గిరిజనులకు నివాళులర్పించని కాంగ్రెస్ ఇప్పుడు ఇంద్రవెళ్లికి వెళ్లడం సిగ్గుచేటని ఎమ్మెల్యే రఘునందర్ రావు మండిపడ్డారు. గిరిజనులను అక్రమంగా కాల్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఇంద్రవెల్లి సభ పెట్టడం మీ విజ్ఞతకే వదిలేస్తామని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story