Raghunandan Rao: బీజేపీ పై అక్కసుతో ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది

ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లలో చేసిన నిర్లక్ష్యం వల్లే.. నేడు అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతోంది: రఘునందన్ రావు

Rama Rao
Updated on: 7 May 2022 7:28 PM IST
MLA Raghunandan Rao Comments on TRS Government | TS News
X

Raghunandan Rao: బీజేపీ అక్కసుతో ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది

Raghunandan Rao: బీజేపీ పై అక్కసుతో ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టాలని చూస్తే సహించబోమన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుబ్బాక, హుజురాబాద్ ఓటమితో ఆ ఫస్ట్రేషన్ ను బయటపెడుతున్న ఆపార్టీ పెద్దలు ఇలాంటి రైతు కొనుగోళ్లలో ఆలస్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. జనగామ జిల్లాలో పర్యటించిన ఆయన వడ్లకొండ, గానుగపహాడ్, వెంకీర్యాల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే అకాల వర్షాలతో రైతులు తమ పంటలను నష్టపోతున్నారన్నారు. ఇప్పటికే ధాన్యం కొనాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పుడు అకాలవర్షాలకు ధాన్యం తడిసిపోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం హామీల ఛార్జీలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తరుగు పేరుతో రైతుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్ లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో పర్యటించిన 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు.

Rama Rao

Rama Rao

Next Story