Pilot Rohit Reddy: ED ఆఫీస్‌లో MLA రోహిత్ రెడ్డి.. చట్టాన్ని గౌరవిస్తా..

MLA Pilot Rohit Reddy Attend in ED Office
x

Pilot Rohit Reddy: ED ఆఫీస్‌లో MLA రోహిత్ రెడ్డి.. చట్టాన్ని గౌరవిస్తా..

Highlights

Pilot Rohit Reddy: డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

Pilot Rohit Reddy: డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ED ఆఫీస్‎కు వచ్చిన రోహిత్‎రెడ్డి అసలు తనను ఏ కేసులో రమ్మన్నారో తెలియదన్నారు. అయినప్పటికీ ఈడీ విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవిస్తానని ఈడీ నోటీసులకు సమయం కావాలని కోరితే ఇవ్వలేదన్నారు. తన లేఖను తిరస్కరించారని చెప్పారు. తన వద్ద పూర్తి వివరాలు లేవన్న రోహిత్ రెడ్డి.. అందుకే సమయం అడినట్లు చెప్పారు.

అంతకుముందు రోహిత్ రెడ్డి ప్రగతిభవన్‎లో ముఖ్యమంత్రి కేసీఆర్‎తో సమావేశమయ్యారు. ఇవాళ పదిన్నర గంటలకు ఈడీ విచారణ ఉండగా.. రోహిత్ రెడ్డి లాయర్, సహాయకుడు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. రోహిత్ రెడ్డికి సమయం కావాలని లేఖ సమర్పించారు. అభ్యర్థనను తిరస్కరించిన ఈడీ అధికారులు రోహిత్ రెడ్డి ఇవాళ హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈడీ ముందు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories