కూతురితో వివాదంపై హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి

Muthireddy: ప్రజాక్షేత్రంలో ఎదుర్కొలేకే తన బిడ్డను పావులా వాడుకుంటున్నారని ఆరోపణ

Shekhar G
Published on: 1 July 2023 3:43 PM IST
MLA Muthireddy Yadagiri Approached The High Court Over A Dispute With His Daughter
X

కూతురితో వివాదంపై హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి

Muthireddy: తన కూతురితో వివాదంపై హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి భావోద్వేగానికి గురైయ్యారు. ప్రజాక్షేత్రంలో తనను ఎదుర్కోలేకే అమాయకురాలైన తన బిడ్డను పావులా వాడుకుంటున్నారని ఆరోపించారు. జనగామ జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ లో అప్గ్రేడ్ చేసిన 134 వైద్య పరీక్షలను ప్రారంభించిన ఆయన... తనపైకి తన అల్లుడిని ప్రేరేపించడం అధర్మమన్నారు. దమ్ముంటే తనను నీతిగా ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలని సవాల్ చేశారు. ప్రజాసేవకు భంగం కలగకుండా ఉండేందుకే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story