ఈడీ ఆఫీస్‌కు వచ్చిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

*మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు

Rama Rao
Updated on: 27 Sept 2022 3:38 PM IST
MLA Manchireddy Kishan Reddy Came to ED Office | TS News
X

ఈడీ ఆఫీస్‌కు వచ్చిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

Manchireddy Kishan Reddy: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డిని ఈడీ అధికారులు త‌మ కార్యాల‌యంలో విచారిస్తున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విదేశాల్లో వ్యాపారాలకు సంబంధించిన విషయంలో ఈడీ ఆరా తీస్తోంది. గోల్డ్‌మెన్‌కు సంబంధించిన వ్యాపారాల్లో జరిగిన అవకతవకలపై గతంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ నోటీసులపై గతంలో ఎమ్మెల్యే వివరణ ఇచ్చినా ఈడీ సంతృప్తి చెందలేదు. దీంతో ఆగస్ట్‌లో నోటీసులు మరోసారి నోటీసులు జారీ చేసింది. నేడు వ్యక్తిగతంగా ఈడీ కార్యాలయానికి ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్‌రెడ్డి హాజరయ్యారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Rama Rao

Rama Rao

Next Story