సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాలభిషేకం

Madhavaram Krishna Rao: ఎన్నికలు వచ్చాయనే అబద్దాలు చెబుతూ గల్లీ,గల్లీ తిరుగుతున్నారు

Shekhar G
Published on: 29 Aug 2023 6:51 PM IST
MLA Madhavaram Krishna Rao Palabhishekam For CM KCR Portrait
X

సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాలభిషేకం 

Madhavaram Krishna Rao:కూకట్‌పల్లి NPR గార్డెన్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు పగడాల శిరీష బాబురావు, ముద్దం నర్సింహ యాదవ్, సభిహా గౌసుద్దిన్ పాలభిషేకం చేశారు. దివ్యాంగుల కలలను నిజం చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని - ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. దివ్యాంగుల పింఛన్‌ను 3 వేల 16 రూపాయల నుండి 4వేల 16 రూపాయలకు పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలని దివ్యాంగులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. ఎన్నికలు వస్తున్నాయనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు గల్లిగల్లీకి తిరుగుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని కొరారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దివ్యాంగులకు 4వేల పింఛన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. దివ్యాంగుల కోటా కింద డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సైతం ఇస్తామని హామీ ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story