Madhavaram Krishna Rao: కవితపై ఎమ్మెల్యే కృష్ణారావు హాట్ కామెంట్స్.. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నీ చిట్టా బయట పెడతా..

Madhavaram Krishna Rao: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 9 Dec 2025 12:45 PM IST
Madhavaram Krishna Rao: కవితపై ఎమ్మెల్యే కృష్ణారావు హాట్ కామెంట్స్.. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నీ చిట్టా బయట పెడతా..
X

Madhavaram Krishna Rao: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి సహాయంతో జైలుకు పంపించి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి రాష్ట్రాని దోచుకోవాలని కవిత ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దిల్లీలో కేజ్రీవాల్‌ను నాశనం చేశావ్, ఇక్కడ కేసీఆర్, కేటీఆర్‌లను నాశనం చేయాలని చూస్తున్నావని మండిపడ్డారు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే, నీ చిట్టా మొత్తం బయట పెడతానన్నారు. హైదరాబాద్ నగరంలో నువ్వు చేసిన కబ్జాలపై పోరాటం చేస్తానని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story