Lasya Nanditha: ఎమ్మెల్యేగా గెలిచాక లాస్యను వెంటాడిన మృత్యువు.. చివరకు..

MLA Lasya Nanditha Escaped Two Mishaps Before ORR Accident
x

Lasya Nanditha: ఎమ్మెల్యేగా గెలిచాక వెంటాడిన మృత్యువు.. చివరకు..

Highlights

Lasya Nanditha: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Lasya Nanditha: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌‌పై ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఆమె వరుసగా ప్రమాదాలకు గురయ్యారు.

ఫిబ్రవరి 13వ తేదీన నల్గొండలో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఈ సభకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును నార్కట్‌ప‌ల్లి వ‌ద్ద ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆమె వెళ్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది. అంతకు ముందు.. కిందటి ఏడాది డిసెంబర్‌లో ఆమె ఓ లిఫ్ట్‌లో 3 గంటలపాటు ఇరుక్కుపోగా, సిబ్బంది లిఫ్ట్‌ను బద్ధలు కొట్టి బయటకు తీశారు. రెండు ఘోర ప్రమాదాల నుంచి తప్పించుకున్న లాస్య నందిత.. చివరికి ఇవాళ జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories