కాసేపట్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక సమావేశం

MLA Komatireddy Rajagopal Reddy Will Have a Key Meeting
x

కాసేపట్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక సమావేశం

Highlights

Komatireddy Rajagopal Reddy: మునుగోడు నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ

Komatireddy Rajagopal Reddy: తెలంగాణలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీపై విమర్శలు చేయడంతోపాటు తాను బీజేపీలో చేరుతున్నట్లు సంకేతాలిచ్చారు రాజగోపాల్ రెడ్డి. అంతేగాక, అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొవడం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో మునుగోడు నియోజకవర్గ ముఖ్య నేతలతో రాజగోపాల్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే మర్రిగూడెం, చండూరు మండలాలకు చెందిన అనుచరులను హైదరాబాద్‌కు పిలిచారు రాజగోపాల్‌రెడ్డి.

మధ్యాహ్నం 12గంటలకు మర్రిగూడెం అనుచరులతో, సాయంత్రం 4గంటలకు చండూరు మండల నేలతో సమావేశం విడివిడిగా భేటీ అవుతారు. పార్టీ మార్పుపై నేతల అభిప్రాయాలు తీసుకొనున్నారు. భేటీ అనంతరం పార్టీ మార్పుపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలా? లేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా? అనే దానిపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories