Breaking News: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా..!

Breaking News: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా..!

Arun Chilukuri
Published on: 2 Aug 2022 7:50 PM IST
MLA Komatireddy Rajagopal Reddy Resigned For MLA Post
X

Breaking News: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా..!

Komatireddy Rajagopal Reddy: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామ చేశారు. ఈ సాయంత్రం మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన తన రాజీనామా ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని.. ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను ఒక కుటుంబం కోసమే తీసుకొచ్చినట్లైందని రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు సంతోషంగా లేరన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని నియంత పాలన నడుస్తోందని వెల్లడించారు. తన రాజీనామా నియోజకవర్గానికి మేలు చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపిన రాజగోపాల్‌ ఇకనైనా ప్రభుత్వం దిగివస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు. మునుగోడు ప్రజల కోసం సంతోషంగా రాజీనామా చేస్తానని తన పోరాటం తెలంగాణ ప్రజల కోసం అని చెప్పుకొచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story