ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్‌చల్.. డీఈవోను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్

Karimnagar: కరీంనగర్‌ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసాగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 July 2024 7:45 PM IST
MLA Kaushik Reddy Demands To Suspend DEO Janardhan Rao
X

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్‌చల్.. డీఈవోను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్

Karimnagar: కరీంనగర్‌ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసాగా మారింది. కరీంనగర్ డీఈవో జనార్ధన్ రావును సస్పెండ్ చేయాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో రివ్యూ మీటింగ్ గురించి అడిగితే స్పందించలేదని కలెక్టర్ ముందు ఫైర్ అయ్యారు. వెంటనే DEOను సస్పెండ్ చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా రివ్యూ మీటింగ్ పెట్టుకునే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. తనను అవమానించారని.. ఎమ్మెల్యేను అవమానించినందుకు.. స్పీకర్‌ దగ్గర మోషన్ పిటిషన్ దాఖలుచేస్తానన్నారు. అప్పటికీ DEOను సస్పెండ్ చేయకపోతే.. హైకోర్టుకు వెళ్తానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story