ప్రమాదం జరిగినరోజు నా కుమారుడు నాతోనే ఉన్నాడు : ఎమ్మెల్యే కాటసాని

హైదరాబాద్‌ సైబర్‌టవర్‌ దగ్గర జరిగిన రోడ్డుప్రమాదం ఘటనపై స్పందించారు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఈ నెల 5న బంపర్‌ రిపేర్‌ కోసం కారును గ్యారేజ్‌లో ఇచ్చామన్నారు.

admin
Published on: 14 Nov 2020 7:32 PM IST
ప్రమాదం జరిగినరోజు నా కుమారుడు నాతోనే ఉన్నాడు : ఎమ్మెల్యే కాటసాని
X

హైదరాబాద్‌ సైబర్‌టవర్‌ దగ్గర జరిగిన రోడ్డుప్రమాదం ఘటనపై స్పందించారు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఈ నెల 5న బంపర్‌ రిపేర్‌ కోసం కారును గ్యారేజ్‌లో ఇచ్చామన్నారు. ప్రమాదం జరిగినరోజు తన కుమారుడు ఓబుల్‌రెడ్డి బనగానపల్లెలో తనతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. కారు రిపేర్‌ పూర్తయ్యిందని గ్యారేజ్ యజమాని ఫోన్‌ చేయడంతో ఓబుల్‌రెడ్డి తన స్నేహితుడు కౌశిక్‌కు ఫోన్‌ చేయడం జరిగిందన్నారు. కౌశిక్‌ మరో స్నేహితుడు కాశీ విశ్వనాథ్‌ అనే వ్యక్తిని వెంట తీసుకెళ్ళి కారును తీసుకుని.. తిరిగి వచ్చే సమయంలో రోడ్డుప్రమాదం చేశారని స్పష్టం చేశారు. రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న ఎమ్మెల్యే కాటసాని.. పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచినా తన కుమారుడు ఓబుల్‌రెడ్డి సహకరిస్తాడని చెప్పారు. ఒకవేళ రోడ్డుప్రమాదం జరిగిన సమయంలో ఓబుల్‌రెడ్డి ఉన్నట్టు రుజువైతే పోలీసులు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.



admin

admin

Next Story