ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

X
Highlights
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారనివారికే పీసీసీ పదవి ఇవ్వాలని ఆయన...
Arun Chilukuri12 Dec 2020 8:58 AM GMT
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారనివారికే పీసీసీ పదవి ఇవ్వాలని ఆయన సూచించారు. పార్టీని నష్టపరిచే కుట్ర జరుగుతోందని జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో..ఠాగూర్‌కు తెలుసో, లేదో అని అన్నారు. మరోసారి ఆయన్ను కలిసి గట్టిగా చెప్తామని అవసరమైతే ఢిల్లీకి వెళ్లడానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు జగ్గారెడ్డి.
గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ అధ్యక్షతన టీపీసీసీ కొత్త సారధి ఎంపికపై అభిప్రాయ సేకరణ ముగిసింది. ప్రస్తుతం వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై సమీక్ష జరుగుతోంది. సీఎల్పీనేత భట్టితో పాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు.
Web TitleMLA Jagga Reddy Sensational Comments On Tagore
Next Story