Jagga Reddy: షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా జీవితంలో నాయకురాలు కాలేదు

Jagga Reddy: మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు ప్లాన్‌ చేసుకోండి

Jyothi
Updated on: 27 Sept 2022 3:35 PM IST
MLA Jagga Reddy Comments on YS Sharmila
X

Jagga Reddy: షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా జీవితంలో నాయకురాలు కాలేదు

Jagga Reddy: తెలంగాణలో YSRTP అధ్యక్షురాలు షర్మిల, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో షర్మిలపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు జగ్గారెడ్డి. తను కేటీఆర్‌కు కోవర్డ్ అని నింద వేయడంపై తర్వాత స్పందిస్తానన్నారు. షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా జీవితంలో నాయకురాలు కాలేదని ఎద్దేవా చేశారు. షర్మిల తల్లి విజయమ్మకు తానో సలహా ఇస్తానని.. ఏపీలో మూడు రాజధానుల గొడవ పక్కన పెట్టి.. మూడు రాష్ట్రాలు చేసుకొని కొడుకు, కూతురు, మరో వ్యక్తి మూడు రాష్ట్రాలకు సీఎంలుగా అయిపోండని సెటైర్లు వేశారు. వైఎస్ కుటుంబం గొడవకు రెండు రాష్ట్రాల పంచాయతీగా చూపించొద్దని జగ్గారెడ్డి అన్నారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story