logo
తెలంగాణ

Etela Rajender: బీజేపీ ఖాతాలో 20 వ రాష్ట్రంగా తెలంగాణ..

MLA Etela Rajender Slams CM KCR
X

Etela Rajender: బీజేపీ ఖాతాలో 20 వ రాష్ట్రంగా తెలంగాణ

Highlights

Etela Rajender: బీజేపీ ఖాతాలో 20 వ రాష్ట్రంగా తెలంగాణ చేరబోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

Etela Rajender: బీజేపీ ఖాతాలో 20 వ రాష్ట్రంగా తెలంగాణ చేరబోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఫ్లెక్సీల పేరుతో చీప్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మోడీ ప్రజల హదయాల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ బావిలో కప్పలాంటి వారని ప్రపంచ దేశాల్లో భారత ఔనత్యాన్ని చాటి చెబుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని ఈటల అన్నారు. ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్‌ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ టీఆర్‌ఎస్‌ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోందన్నారు. బీజేపీ పండగకు కేసీఆర్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో చెల్లని కేసీఆర్ మొహం పక్క రాష్ట్రాల్లో చెల్లుతుందా? అని ఈటల ప్రశ్నించారు.

Web TitleMLA Etela Rajender Slams CM KCR
Next Story