Hyderabad: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌పై ఎమ్మెల్యే దానం కామెంట్స్‌

Hyderabad: హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన ప్లేయర్లు ఉన్నారు -దానం

Sandeep Eggoju
Published on: 20 Feb 2021 2:07 PM IST
MLA Dhanam Ngender Hot Comments On SRH Team
X

Representational Image

Hyderabad: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఐపీఎల్‌ ఆక్షన్‌లో హైదరాబాద్‌ క్రికెట్‌ క్రీడాకారులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన ప్లేయర్లు ఉన్నారని, వారిని జట్టులోకి తీసుకోకపోవడం దారుణమని దానం చెప్పారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన డేవిడ్‌ వార్నర్‌ హైదరాబాద్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఉండడం కరెక్ట్‌ కాదని ఆయన అభిప్రయాపడ్డారు. ఈ సీజన్‌లో SRH టీమ్‌లో హైదరాబాద్‌ ప్లేయర్లు లేకపోతే మాత్రం.. ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించారు దానం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story