Danam Nagender: సీఎం రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం భేటీ

Danam Nagender: అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.

Arun Chilukuri
Updated on: 15 March 2024 5:30 PM IST
MLA Danam Nagender Meets CM Revanth Reddy
X

Danam Nagender: సీఎం రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం భేటీ

Danam Nagender: అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటాలని పార్టీ భావిస్తుంటే... మరోపక్క అధిష్ఠానానికి సీనియర్లు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారగా... మరికొందరు సీనియర్ లీడర్లు సైతం బీజేపీ, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.

తాజాగా రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ కావడంతో ఘర్ వాపసీ అంటూ ప్రచారం జోరందుకుంది. సీఎంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్ మున్షి, పలువురు మంత్రులతో దానం భేటీ అయ్యారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సైతం రేవంత్ రెడ్డిని కలిశారు. మూడోసారి సైతం బీఆర్ఎస్ టికెట్ వస్తుందని ఆశించి భంగపడటంతో పార్టీ మారే యోచనలో పసునూరి ఉన్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story