Danam Nagender: వారు మాట్లాడింది, మైక్‌లో రికార్డ్ కాలేదు.. వారి మాటలకు సమాధానంగానే ఆ వ్యాఖ్యలు చేశా..

Danam Nagender: హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో CMRF చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Aug 2024 12:03 PM IST
MLA Danam Nagender Comments BRS Leaders
X

Danam Nagender: వారు మాట్లాడింది, మైక్‌లో రికార్డ్ కాలేదు.. వారి మాటలకు సమాధానంగానే ఆ వ్యాఖ్యలు చేశా..

Danam Nagender: హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో CMRF చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. అసెంబ్లీలో తనను కావాలనే టార్గెట్ చేశారని.. హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడేందుకు అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు. బయటకు చెప్పలేని పదాలతో దూషించారన్నారు. వారు మాట్లాడింది, మైక్‌లో రికార్డ్ కాలేదని...వారి మాటలకు సమాధానంగానే ఆ వ్యాఖ్యలు చేశానన్నారు దానం నాగేందర్.

అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుండి బీఆర్ఎస్ నాయకులు సభను సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారని.. ప్రతిపక్షంగా వారికి సమస్యలపై చర్చలు చేయాల్సిన బాధ్యత ఉంది కానీ అలా జరగలేదన్నారు. గత పదేళ్లుగా ఏనాడు తన లాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు ఎమ్మెల్యే దానం నాగేందర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story