Secunderabad: సికింద్రాబాద్ తిరుమలగిరిలో యువతుల మిస్సింగ్

Secunderabad: పుట్టినరోజు వేడుకలకు వెళ్లి అదృశ్యమైన ముగ్గురు యువతులు

Dhatripriya
Published on: 22 Feb 2023 11:39 AM IST
Missing Young Women In Tirumalagiri Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్ తిరుమలగిరిలో యువతుల మిస్సింగ్

Secunderabad: పుట్టినరోజు వేడుకలకు అని చెప్పి బయటకు వెళ్లిన ఇద్దరు యువతులు, ఓ బాలిక అదృశ్యమయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ బాలిక తన ఇద్దరు స్నేహితులైన హసీనా, సకీనా అనే ఇద్దరు యువతులతో కలిసి ప్రమీల ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. స్నేహితులు, తెలిసిన వారి వద్ద కుటుంబసభ్యులు, బంధువులు ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబసభ్యులు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story