Hyderabad: అదృశ్యమైన చిన్నారి కథ విషాదాంతం.. బాలిక మృతిపై అనేక అనుమానాలు..?

Missing Case: జవహర్ నగర్ లో బాలిక మిస్సింగ్ విషాదాంతంగా మారింది.

Arun Chilukuri
Published on: 16 Dec 2022 12:37 PM IST
Missing Girl Mystery Ends in Tragedy, Raises Doubts
X

Hyderabad: అదృశ్యమైన చిన్నారి కథ విషాదాంతం.. బాలిక మృతిపై అనేక అనుమానాలు..?

Missing Case: జవహర్ నగర్ లో బాలిక మిస్సింగ్ విషాదాంతంగా మారింది. నిన్న అదృశ్యమైన బాలిక ఇందు మృతదేహం దమ్మాయిగూడ చెరువులో లభ్యమైంది. నిన్న ఉదయం స్కూలుకు వెళ్లిన పాప ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో నిన్న సాయంత్రం నుంచి పోలీసులు గాలింపు చేపట్టారు. దమ్మాయిగూడ ప్రాంతంలో గాలిస్తున్న పోలీసులకు చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. దీంతో బాలిక మిస్సింగ్ ఘటన విషాదాంతంగా మారింది.

పదేళ్ల ఇందు దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చుదువుతోంది. నిన్న ఉదయం తండ్రితో పాటు స్కూల్ కు వెళ్లిన బాలిక సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లగా.. బాలిక బ్యాగును అక్కడే వదిలేసి, ఆడుకోవడానికి వెళ్లినట్టు చెప్పారు. దీంతో ఇందు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు ఫిర్యాదుతో సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. పాప చివరిసారిగా చెరువు వైపు వెళ్లినట్టు సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో గాలింపు చేపట్టిన పోలీసులు దమ్మాయిగూడ చెరువులో పాప మృతదేహన్ని గుర్తించారు.

బాలిక తల్లిదండ్రులతో పాటు స్కూల్ హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని.. ఇందు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీంను రంగంలోకి దింపారు. స్కూల్ ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్తా దగ్గర ఉన్న ఓ సీసీటీవీలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియలేదు. డాగ్ స్వ్కాడ్ మాత్రం చెరువు దగ్గరకు వెళ్లి ఆగిపోయాయి. ఆడుతూ, పాడుతూ ఇంట్లో తిరిగే తమ చిన్నారి ఇక లేదు అని తెలిసి.. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నిన్న అదృశ్యమైన తమ పాప ఎక్కడో ఒకచోట ఉంటుంది.. ఆలస్యంగానైనా ఇంటికి తిరిగొస్తుందని ఎదురుచూశారు. అల్లారుమద్దుగా పెంచుకున్న తమ పాప.. ఇక తిరిగిరాదాని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు.

బాలిక మృతికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఇందు స్కూల్ నుంచి చెరువు దగ్గరకు ఎందుకు వెళ్లింది..? ఎలా వెళ్లింది..? ఒక్కతే చెరువు దగ్గరకు వెళ్లిందా..? ఎవరైనా పాపను అక్కడికి తీసుకెళ్లారా..? హత్య చేసి చెరువులో పడేశారా..? అసలు పాప చెరువులో ఎలా పడింది.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఇందు మృతిపై తలెత్తుతున్నాయి. పోస్టుమార్టమ్ నివేదిక వస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story