Khammam: అర్థరాత్రి జైలు సూపరింటెండెంట్ ఇంటికి నిప్పు

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్‌ జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న హనుమంతరావు క్వార్టర్స్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.

Arun Chilukuri
Published on: 27 Aug 2022 3:37 PM IST
Miscreants set fire to jail official’s house in Sathupalli
X

Khammam: అర్థరాత్రి జైలు సూపరింటెండెంట్ ఇంటికి నిప్పు

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్‌ జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న హనుమంతరావు క్వార్టర్స్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. హనుమంతరావు సెలవులపై వెళ్లడంతో అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటి తాళాలు పగలకొట్టి లోపలికి చొరబడ్డ దుండగులు ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేశారు. అనంతరం కొన్ని వస్తువులను నిప్పుపెట్టి పరారయ్యారు. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు జైల్‌ వార్డెన్‌ సాంబశివరావు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story