నార్సింగిలో రెచ్చిపోయిన పోకిరీలు.. కిరాణ షాప్‌కు వెళ్లిన విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన

కత్తితో విద్యార్థిని తండ్రి గొంతు కోసిన మరో పోకిరి ప్రవీణ్‌

Shashank Gullapelli
Published on: 1 April 2024 6:26 PM IST
Misbehave With Student Who Went To Kiran Shop
X

నార్సింగిలో రెచ్చిపోయిన పోకిరీలు.. కిరాణ షాప్‌కు వెళ్లిన విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన

rangareddy: కొవ్వెక్కిన పోకిరీలు..విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారు. ప్రశ్నించిన బాధితురాలి తల్లిదండ్రులపైనా తల్వార్లతో దాడి చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో జరిగింది. కిరాణ షాప్‌కు వెళ్లిన విద్యార్థిని ఒంటిపై నీళ్లు పోసి అసభ్యంగా ప్రవర్తించారు. పోకిరీల నుంచి తప్పించుకున్న ఆ బాలిక..ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం తన తల్లిదండ్రులకు చెప్పింది. జరిగిన ఘటనపై నిలదీసేందుకు ప్రయత్నించిన ఆ అమ్మాయి తల్లిదండ్రులపైనా పోకిరీలు కత్తితో దాడి చేసి దుర్భాషలాడారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై 307 సెక్షన్‌తో పాటు నిర్భయ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ప్రవీణ్, సురేష్‌తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేసి..వారి నుండి నాలుగు తల్వార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story