హైదరాబాద్‌లో మరో దారుణం.. రెండు నెలలుగా బాలికపై అత్యాచారం

Minor Girl Rape Case In Hyderabad
x

హైదరాబాద్‌లో మరో దారుణం.. రెండు నెలలుగా బాలికపై అత్యాచారం

Highlights

Hyderabad: స్నేహితులతో కలిసి బాలికపై రెండు నెలలుగా ధీరజ్‌ సామూహిక అత్యాచారం

Hyderabad: జూబ్లీహిల్స్‌లో బాలిక ఘటన మరవక ముందే సికింద్రాబాద్‌ పరిధిలో మైనర్‌పై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్ఖానా పరిధిలో బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో మైనరు బాలుడు కూడా ఉన్నాడు. బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్న నిందితులు ధీరజ్‌, రితేశ్‌ బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నారు. అత్యాచారం చేసిన సమయంలో వీడియోలు తీసిన ధీరజ్‌, రితేశ్‌ బాలికను భయపెట్టారు.

వీడియోలు ఇస్తానని చెప్పి పిలిచి ఇతర స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మార్చి నెలలో జరిగింది. బాలిక పరిస్థితి చూసి ఆమె కుటుంబసభ్యులు మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లారు. సైక్రియాటిస్ట్ వద్ద బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు మే30న కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories