Hyderabad: ఇన్‌స్టా గ్రామ్‌లో వేధింపులు..హైదరాబాద్‌లో మైనర్ బాలిక సూసైడ్

Minor Girl Committed Suicide Due To Love Harassed In Hyderabad
x

Hyderabad: దారుణం.. యువకుడి వేధింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్య

Highlights

Hyderabad: హయత్‌నగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. బాలుడి వేధింపులకు తాళలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది.

Hyderabad: హయత్‌నగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. బాలుడి వేధింపులకు తాళలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. రంగనాయకుల గుట్టకు చెందిన మైనర్ బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. స్థానికంగా ఉండే బాలుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఆ మైనర్ బాలికను బాలుడు ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేశాడు. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. బాలుడి ఇంటికి వెళ్లి.. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైలెంట్ గా ఉన్న బాలుడు మళ్లీ వారం రోజులుగా వేధింపులకు దిగాడు.

తన సోదరుడి ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌‌నుంచి బాలికకు అసభ్య మెస్సెజ్‌లు, వీడియో కాల్‌ చేస్తుండటంతో.. తన తండ్రికి విషయం తెలియజేసింది. రెండు రోజుల క్రితం బాలిక తండ్రి హయత్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నిన్న బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలుడు వెళ్లి బెదిరించడంతో ఆత్మహత్య చేసుకుందని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంవల్ల తన కుమార్తె చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories