Medaram: జాతర సమయంలోనే తెలంగాణ బిల్లు.. మంత్రులు పొన్నం, సీతక్క వెరైటీ చిట్ చాట్..

Ministers Seethakka And Ponnam Prabhakar Visited Sammakka And Saralamma
x

Medaram: జాతర సమయంలోనే తెలంగాణ బిల్లు.. మంత్రులు పొన్నం, సీతక్క వెరైటీ చిట్ చాట్..

Highlights

Medaram: సమ్మక్క జాతరపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క చిట్ చాట్ చేశారు.

Medaram: సమ్మక్క జాతరపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క చిట్ చాట్ చేశారు. కారులో ప్రయాణిస్తూనే తెలంగాణ ఉద్యమం, జాతర అంశాలపై మంత్రులు సంభాషించుకున్నారు. మేడారం జాతర సమయంలోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన విషయాన్ని మంత్రి పొన్నం గుర్తు చేశారు. ఎప్పుడైనా మేడారం జాతరు వచ్చారా అన్న అని సీతక్క అడుగగా.. పొన్నం బదులిస్తూ.. చిన్నప్పటి నుంచి అనేక సార్లు జాతరకు వచ్చానని ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటు కావాలని మొక్కుకున్నానని గుర్తు చేశారు.

అలాగే 2014లో ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రోజే దేవతలు వనం నుంచి గద్దెపైకి వచ్చాని పొన్నం గుర్తు చేశారు. గతంలో ఎవరు జాతరకు వచ్చినా జై సమ్మక్క, జై సారలమ్మతో పాటు జై తెలంగాణ అనేవారని 60 ఏళ్ల ప్రజల ఆకాంక్షకు సంబంధించిన బిల్లును తాను ఆ జాతరలో ఉండగానే ప్రవేశపెట్టారని సీతక్క చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories