ఒకే సెగ్మెంట్‌లో ఇద్దరు నేతల కయ్యం.. మూడో కృష్ణుడి ఎంట్రీతో సమరం రసవత్తరం

ఒకే సెగ్మెంట్‌లో ఇద్దరు నేతల కయ్యం.. మూడో కృష్ణుడి ఎంట్రీతో సమరం రసవత్తరం
x
Highlights

ఒకరు మంత్రి, ఇంకొకరు మాజీ మంత్రి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉప్పు నిప్పులా ఉండే ఆ నేతలిద్దరు ఒకే గొడుగు కిందకు, ఒకే పార్టీలోకి వచ్చినా ఎందుకో...

ఒకరు మంత్రి, ఇంకొకరు మాజీ మంత్రి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉప్పు నిప్పులా ఉండే ఆ నేతలిద్దరు ఒకే గొడుగు కిందకు, ఒకే పార్టీలోకి వచ్చినా ఎందుకో పొసగడం లేదు. రోజూ కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. గతంలో ఉండే వర్గపోరు మరింత ముదురుతోంది. ఒకే సెగ్మెంట్ లో ఆ ఇద్దరు నేతల కయ్యం చూస్తున్న క్యాడర్, కంగుతింటోంది. ఆ ఇద్దరు నేతల మద్య వియ్యం కుదిర్చేందుకు సొంత కుటుంబంలో నుంచి ఓ ఎంపి రంగంలోకి దిగినా సెట్ కావడం లేదట. ఇంతకీ ఆ ఇద్దరి మద్య రాజకీయ కక్ష నిజమేనా ఆ కక్ష ను చూసిన క్యాడర్ ఎలా కన్పూజవుతోంది.

ఓరుగల్లు రాజకీయాల్లో తలపండిన నేత రెడ్యానాయక్. కాంగ్రెస్ హాయాంలో మంత్రిగా పనిచేసిన లీడర్. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకుని మంత్రి పదవినీ ఆశించారు. కాని టీఆర్ఎస్ హైకమాండ్‌కో లెక్క ఉంటుంది కాబట్టి రెడ్యా, రాజకీయ ప్రత్యర్థి సత్యవతి రాథోడ్‌ను మంత్రిని చేశారు. కానీ ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు కద.

టిడిపి రాజకీయ బడిలో సర్పంచ్ నుంచి జడ్పిటిసీ, ఎమ్మెల్యేగా ఎదిగి రెడ్యా నాయక్‌నే రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తూ టీఆర్ఎస్‌లో చేరి, వెనక్కి తగ్గకుండా మంత్రిగా పని చేస్తున్నారు సత్యవతి రాథోడ్. ఇద్దరిదీ ఒకే నియోజకవర్గం. గతంలో ఒకరు ఓడిపోతే ఇంకొరు గెలిచి పంతం నెగ్గించుకున్న చరిత్ర. ఇప్పుడు అటు రెడ్యా, ఇటు సత్యవతి ఒకే పార్టీలో ఉండటంతో సత్యవతిని కాదని రెడ్యాకు ఎమ్మెల్యేగా, ఆయన కూతురు మాలోతు కవితకు అవకాశం కల్పించారు. సత్యవతి సంయమనం పాటించడంతో ఆమెకు మంత్రి పదవి లభించింది. అదే పాత శత్రువుల మధ్య కొత్తగా ప్రచ్చన్నయుద్ధాన్ని రాజేసింది.

ఇంతవరకు ఓకే కాని, ఒకే సెగ్మెంట్ నుంచి ఇద్దరు నేతలు అందులో ఒకరు మంత్రి, ఇంకొకరు మాజీ మంత్రి ఉండడంతో క్యాడర్ మధ్య అయోమయం నెలకొంది. స్థానికంగా ఏ పని చేసినా స్థానిక ఎమ్మెల్యేనే ఫైనల్ అని, తనకు తెలియకుండా నియోజకవర్గంలో అడుగు పెట్టవద్దని అధికారులకు, క్యాడర్ కు చెప్పేశారట రెడ్యా. తాను జిల్లాకే మంత్రినని తన మాటే పైనల్ అని మంత్రి హుకుం జారీ చేశారట. దీంతో ఇద్దరు నేతల సమరం అధికారుల తలనొప్పిగా మారింది. విషయం పార్టీ హైకమాండ్ వద్దకు కూడా చేరింది. వెంటనే ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదానికి తెరదించడానికి రెడ్యానాయక్ కూతురు, ప్రస్తుత మహబూబాబాద్ ఎంపీ కవిత మధ్యవర్తిత్వం వహించారట. అయినా రెడ్యానాయక్ ససేమిరా అనడంతో కథ మొదటికి వచ్చిందట. ఇద్దరి ఆధిపత్య పోరులో బలయ్యేది మాత్రం కార్యకర్తలు, పార్టీయేనన్న చర్చ జరుగుతోంది.

శత్రువుకు శత్రువు మిత్రువు అనే సామెతను గుర్తు చేసుకుంటూ రెడ్యా నాయక్ సత్యవతిని లైట్ తీసుకుంటూ జిల్లాకు చెందిన మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో టచ్ లో ఉంటున్నారట. విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్, చేసేదేమిలేక అధికారులు, క్యాడర్ తో టచ్ లో ఉంటున్నారట. ప్రోటోకాల్ ప్రకారం తాను మంత్రినని తనకు తెలియకుండా నియోజకవర్గంలో, జిల్లాలో ఏ కార్యక్రమాలూ జరగడానికి వీల్లేదని హుకుం జారీ చేశారట. అంతేకాదు మంత్రి తన ఉనికిని కాపాడుకునేందుకు ఎర్రబెల్లి దయాకర్ కార్యక్రమాలకు పోటీగా వెళ్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఎర్రబెల్లి కార్యక్రమాలపై సమాచారం ఇవ్వని జిల్లాస్థాయి అధికారులపై ఆమె నాలుగైదు సార్లు ఫైర్ కూడా అయ్యారట. ఒకదశలో మంత్రి దయాకర్ రావు, రెడ్యా కలిసి తనను లైట్ తీసుకుంటున్నారు టార్గెట్ చేస్తున్నారన్న కామెంట్స్ కూడా పార్టీ ముఖ్యులతో షేర్ చేసుకున్నారట. మొత్తానికి ఎక్కడా బయటపడకుండా మంత్రి సత్యవతి ఉనికి కోసం సాగిస్తున్న పోరాటంపై పార్టీ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.

అధికార పార్టీలో రాజకీయ ఉద్దండులుగా చెలామణి అవుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ వర్సెస్ మంత్రి సత్యవతి రాథోడ్ ల మధ్య, కోల్డ్‌వార్‌లో కార్యకర్తలు బలైపోతున్నారు. అధిష్టానం దృష్టి పెట్టి సమస్యను తీర్చి కార్యకర్తలకు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories