నిధులు లేక ఏపీ సీఎం కేంద్రాన్ని అడుక్కుతింటున్నారు.. టీఆర్ఎస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Prashanth Reddy: రైతు ధర్నాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 12 Nov 2021 3:37 PM IST
Minister Vemula Prashanth Reddy Sensational Comments on AP CM Jagan
X

నిధులు లేక ఏపీ సీఎం కేంద్రాన్ని అడుక్కుతింటున్నారు.. టీఆర్ఎస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Prashanth Reddy: రైతు ధర్నాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ నిధులు లేక కేంద్రాన్ని అడుక్కు తింటున్నారని ఫైర్ అయ్యారు. గతంలో తెలంగాణ ఏర్పడితే అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు బిక్షం ఎత్తుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నడవాలంటే కేంద్రం నిధులు కావాలన్న ప్రశాంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని విమర్శించారు.

దేశం మొత్తం రైతులు మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌నే ప్ర‌ధాని మోడీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. కానీ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుల మేలు కోసం మీట‌ర్లు పెట్ట‌ర‌ని వెల్ల‌డించారు. కేంద‌ప్ర‌భుత్వం రైతుల‌ను చేస్తున్న మోసాల‌కు బీజేపీ నేత‌ల‌ను అడుగ‌డుగునా అడ్డుకోవాల‌ని పిలుపునిచ్చారు మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story