బండి సంజయ్, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి వేముల కౌంటర్

Minister Vemula Prashanth Reddy Counter to Bandi Sanjay and Revanth Reddy
x

బండి సంజయ్, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి వేముల కౌంటర్

Highlights

Vemula Prashanth Reddy: బండి సంజయ్, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Vemula Prashanth Reddy: బండి సంజయ్, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2023 డిసెంబర్‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన సీఎం కేసీఆర్‌కు లేదని చెప్పారు. ఐదేళ్ల కాలపరిమితిలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇంకా 10 నెలలు గడువు ఉన్నందున ప్రజల్లో తిరిగి మంచి పేరు తెచ్చుకోవాలని బండి సంజయ్, రేవంత్‌ రెడ్డికి మంత్రి వేముల కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలనే తపన ఉండాలని, మతాల మధ్య చిచ్చుపెట్టడం కాదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పార్టీలు,రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories